phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Thursday, March 3, 2016

'కృష్ణాష్టమి' కొట్టిన దెబ్బకు కళ్లు తెరుచుకున్నాయట




హైదరాబాద్ : వరస ఫ్లాఫ్ లు ఎంతటివారినైనా కలవరపెడతాయి. ఇప్పుడు సునీల్ అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా వాసు వర్మ దర్శకత్వంలో రూపొంది విడుదైలన కృష్ణాష్టమి చిత్రం ఘన విజయం సాధిస్తుందని భావించాడు. కానీ ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద చీదేసింది.
అయితే సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చాయి. కొన్ని సెంటర్లలలో వీకెండ్స్ కూడా బాగానే కలెక్ట్ చేసింది. అంటే సునీల్ కు క్రేజ్ బాగానే ఉంది కానీ సినిమాలే సరైనవి పడటం లేదని అర్దమవుతోంది. ముఖ్యంగా ఆయన సినిమాలకు కామెడీ ఆశించి వస్తున్నారు. అది లేకపోవటంతో నిరాశపడతున్నారు.

ఈ విషయం కృష్ణాష్టమి తో అర్దం చేసుకున్న సునీల్ తన తదుపరి చిత్రం జక్కన్న లో కామెడీ డోస్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిస్తోంది. ఆకెళ్ల వంశీ కృష్ణ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దర్శకుడుతో కూర్చుని సునీల్ ఈ సినిమాలో సాధ్యమైనంత కామెడీని ఎలా చొప్పించాలా అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే రీషూట్ చేసైనా కామెడీని కలపే సినిమాని బయిటకు తేవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. మొత్తానికి మనోడు కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందన్నమాట.
అందాల రాముడు వంటి హిట్ సినిమాతో కమిడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ కు ఆ తర్వాత మర్యాద రామన్న పెద్ద బ్రేక్ ఇచ్చింది. తర్వాత వచ్చిన పూల రంగడు, తడాఖా చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు.

No comments:

Post a Comment

Ad