కాశీ లో మహేష్ మకాం : మిగతా పుణ్య క్షేత్రాల్లో కూడా
హైదరాబాద్ : మహేష్ బాబు త్వరలో పుణ్య క్షేత్రాలను దర్శించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన కాదు. తన చిత్రం బ్రహ్మోత్సవం... షూటింగ్ నిమిత్తం వారణాసి, తిరుపతి, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రాల సందర్శించనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం కాశీకు వెళ్లారని సమచారం. అందుతున్న సమాచారం ప్రకారం...మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ షూటింగ్ పూర్తవగనే నార్త్ ఇండియాలో మేజర్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసారు. ముఖ్యంగా అక్కడ పవిత్రమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. అందుకోసం వారణాసి, హరిద్వార్ వంటి పుణ్య క్షేత్రాలను ఎంపిక చేసారు. సినిమా కథ..తిరుపతిలోని బ్రహ్మోత్సవం...కుటుంబ బంధాల చుట్టూ సాగుతుంది. అంతేకాదు ఉదయపూర్ లో ఓ పాటను సైతం చిత్రీకరించనున్నారు.
No comments:
Post a Comment