phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Wednesday, March 2, 2016

Find out why Kangna Ranaut is angry at a shoot ?





లీక్ వీడియో: సెట్లో సహనం కోల్పోయి కోపంతో అరిచేసి...

ముంబై : సెలబ్రెటీలు తెరపై చూపించినంత సౌమ్యంగా నిజ జీవితంలో ఉండరు. వారూ కూడా సామాన్యులలాగానే తెర వెనక బిహేవ్ చేస్తూంటారు. కాకపోతే వాటికి సంభందించిన విషయాలు బయిటకు రావు కాబట్టి మనకు పెద్దగా తెలియదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా కోపం వచ్చి రెచ్చిపోయిన వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆమె కోపం చూసి షాక్ అవుతున్నారు. ఆ వీడియోను మీకు అందిస్తున్నాం.....


ఇక తొలి నుంచి కంగనా రనత్ ..ధైర్యం గల అమ్మాయి. నటిగా ఆమె ఎంత ఆత్మస్ధైరంగల పాత్రలు చేస్తుందో నిజ జీవితంలోనూ అలాగే ఉంటుంది. ఈ వీడియోలో ఆమెను బాడీ డబుల్ కోసం ఒప్పించటానికి చేస్తున్న ప్రయత్నం..దానికి ఆమె కోప పడుతూండటం గమనించవచ్చు. వ్యానిటి వ్యాన్ లో ఉండగా జరిగిన సంఘటన ఇది. బహుశా ఈ వీడియోలో ఆమె అసెస్టెంట్ అనుకుంటాను మీరు గమనించవచ్చు. ఈ సంభాషణ ఇలా సాగింది. బోయ్: బాడీ డబుల్ చేయాలని నిర్ణయించుకున్నాం కంగన: బాడీ డబులా? ఎందుకు ఇప్పుడు బాడీ డబుల్ ...అవసరమేంటి? బోయ్: చాలా బరువులుఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ! కంగనా: నేను బాడీ డబుల్ తో పనిచేయను ! బోయ్: అది చాలా ఇబ్బంది పెడుతుంది మీకు ! కంగనా: ఇబ్బందా ?నేను మొదటే చెప్పాను... నేను బాడీ డబుల్ వాడనని, దాని గురించి ఎవరూ చెప్పలేదు ..! ఇలా అని ఆమె కోపంగా రంగోళిని కేక వేస్తూ తర్వాత చాలా కోపంతో కూడిన గొడవ జరిగిందని తెలుస్తోంది.


ఇలాగే గతంలోనూ వివిధ సందర్బాల్లో కంగనా రనౌత్ ...తన మనస్సులో అభిప్రాయాలు స్పష్టంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహిళ సాధికారత గురించి తనదైన రీతిలో చెప్పుకొచ్చింది. సెక్సీగా కనిపించినంత మాత్రాన మహిళా సాధికరత సాధ్యం కాదని, ఆ ప్రక్రియ నిదానంగా, క్రమ పద్ధతిలోనే సాధ్యమవుతుందని కౌంటర్ ఇచ్చింది. 'మహిళలు అభివృద్ధి చెందడమంటే మగవాళ్లను అణిచివేసినట్లు కాదు. పురుషులు స్త్రీలపట్ల సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవటానికి మరో 20 ఏళ్లు పడుతుందని నా ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించింది.

No comments:

Post a Comment

Ad