phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Wednesday, March 2, 2016

విడాకులుకి అప్లై చేసిన మాజీ హీరోయిన్, మహేష్ సినిమా రిజెక్టు

బెంగుళూరు : తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన ప్రేమ గుర్తుండే ఉండి ఉంటుంది. ప్రేమకు టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. టాప్ హీరోలు అందరితోను నటించిన ప్రేమకు వెంకటేష్ తో నటించిన 'ధర్మచక్రం' సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. అయితే ఈమె పెళ్ళి చేసుకున్న తరువాత గత కొన్ని సంవత్సరాలుగా ఈమె వార్తలు మీడియాలో కనిపించడం లేదు. అయితే మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతూ వార్తలకి ఎక్కింది. వివహాల్లోకి వెళితే...కెరీర్ లో వెలుగుతున్న సమయంలోనే ( 2006) ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు విభేధాలతో వారిద్దరూ విడిపోవాలనుకున్నారు. తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు నగరంలోని ఫ్యామి శివరాజ్‌కుమార్ నటించిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా ప్రేమ కన్నడచిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమె తెలుగులోనూ చాలా సినిమాలు చేసారు. ముఖ్యంగా ఉపేంద్ర దర్శకత్వంలో నిర్మితమైన ఓం సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది.
కొంతకాలం న్యూజిలాండ్ లో ఉండి ఈమధ్యనే కొద్దికాలం క్రితం తిరిగి బెంగుళూరుకు తిరిగి వచ్చింది. తనకు మహేష్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని తాను వదులుకున్నానని తెలియ చేసింది ప్రేమ. ఈసినిమా దర్శకుడు కొరటాల శివ తనను మహేష్‌ బాబుకి మదర్ క్యారెక్టర్‌లో నటించాలని కోరాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ పాత్ర తనకు నచ్చకపోవటంతో , తానూ తిరస్కరించానని ప్రేమ తెలియచేసిందిదీనితో ఆ ఆఫర్ కాస్తా సుకన్య సొంతమైందట. ప్రస్తుతం తెలుగు పరిశ్రమనుంచి సరైన రోల్స్ వస్తే నటించేందుకు తాను రెడీ అంటూ మనసులోని మాటను బయటపెట్టింది . కానీ ఆ సినిమాల స్థాయి 'ఇంగ్లీష్ వింగ్లీష్‌' లో శ్రీదేవి నటించిన క్యారెక్టర్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. అంటే విడాకులు తీసుకుని...నదియా, శ్రీదేవి, రమ్యకృష్ణలతో పాటుగా హీరోయిన్ ప్రేమ కూడ రంగంలోకి దిగాలని నిర్ణయించుకుందన్నమాట.

No comments:

Post a Comment

Ad