phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Wednesday, March 2, 2016

‘థ్రిల్’చేస్తున్న శ్రీదేవి, సీన్ లోకి కోన వెంకట్

ముంబై: ప్రముఖ తెలుగు సిని రచయిత కోన వెంకట్ ఈ మధ్యన అంటే ఆయన సారధ్యంలో వచ్చిన శంకరాభరణం విడుదలైన తర్వాత పెద్దగా మీడియాలో నానటం లేదు. శ్రీను వైట్లతో విభేధాలు, విమర్శలు, ఆయన రాసిన సినిమాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటం వంటి కారణాలతో సైలెంట్ అయ్యారు. 

సింహం సైలెంట్ గా ఉన్నారంటే నమ్ముతామా.. తన పెన్ పవర్ తో సినిమాలు నిలబెట్టి, తెలుగు, హిందీ భాషలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కు కథలు ఇచ్చిన ఆయన కొద్దిగా వెనకడుగులు వేసినా, మరింత వేగంగా ముందుకు వస్తున్నారు. ఆయన ఇప్పుడు హిందీలో ఓ సినిమా ఓకే చేయించుకున్నారు. ఈ చిత్రం టైటిల్ ‘మామ్'. ఈ సినిమాని రవి ఉడయార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందిస్తున్నారు. అలాగే...ఈ సినిమాలో శ్రీదేవి తల్లి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అక్షయ్ ఖన్నా ఈ చిత్రం లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కి జోడీగా ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ నటిస్తాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించనున్నాడు. ఈ సినిమా తెలుగులోకి వస్తుందనటంలో సందేహం ఏమన్నా ఉందా మరి.

No comments:

Post a Comment

Ad